నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Jul 4, 2009

అమ్మా! తమ్ముడు పుట్టినప్పుడు సుమంత్రారూఢమౌ మే ల్శతాం

రోమపాదుడు శాంతను ఋష్యశృంగుని అయోధ్య నుండి తీసుకొని వెళ్ళుట
వారు ప్రయాణం కట్టినపుడు--
ఆ.
సెలవుగొన్నవాఁడు సెలవుగొన్నట్లుగా
నెసఁగె రాజు ఋష్యశృంగునొద్దఁ
గౌగిలించు నామె కౌఁగిలించినయట్లె
చనియెఁ బట్టమహిషి శాంతయొద్ద. 146

ఆ ఆప్యాయతలు చూడండి. తెలుగు లోగిళ్ళలోనివే అచ్చంగా.
ఆ.
దాసి చంకనున్న తనయుఁడు నెగఁ బ్రాకు
దల్లికొఱకుఁ దల్లి తండ్రి కిచ్చుఁ
తండ్రి తల్లి కిచ్చుఁ దల్లి దాసి కొసంగు
సంభ్రమించి రిట్లు శాంతయు ముని. 147

శాంత కొడుకు గురించి.
శా.
అమ్మా! తమ్ముడు పుట్టినప్పుడు సుమంత్రారూఢమౌ మే ల్శతాం
గమ్మున్ బంపెద నీవు నీపతియు రాఁగా మాట నీ విచ్చి నా
వమ్మాటల్ మఱువంగఁబోకు మునికాంతా ! యంచుఁ గేళీరహ
స్యమ్మున్ గోసల రాజకన్య పలికెన్ శాంతామహాదేవితో. 148

చూడండి ! విశ్వనాథ వారి పద్యం నడక. మాటలు మాట్లాడుకుంటున్నట్లే ఎంత హాయిగా సాగుతుందో !
గీ.
ఎట్టకేలకు మగిడిరి పృథ్విపతియుఁ
బట్టమహిషియుఁ జూతు రా బాటవెంటఁ
బోయెడు రథాలపైనుండి మునియు శాంత
యు త్తలంబునఁ జూతు రయోధ్యవంక. 150

పంచచామరము.
సుమిత్ర రాజుతో నిదేమి చోద్యమో యసుప్రియుం
డు మౌని యెల్లకాల మిందునన్ వసించునా యనున్
సుమిత్ర రాణితో నిదేమి చోద్యమమ్మ ! శాంత తా
ను మౌని యెల్లకాల మిందునన్ వసించునా యనున్. 151

కొన్ని కొన్ని పదాల్ని --మళ్ళీ మళ్ళీ -- ఒకే పద్యంలో తిరిగి తిరిగి ఉపయోగించటం- - దీని వల్ల పద్యంలో ఓ అందం-- --ఓవిధమైన తూగు వచ్చి చదివిన పాఠకునికి ఓరకమైన రసనను చేకూరుస్తాయి. ఒకోచోట ఒకో విషయాన్ని కవి నొక్కి చెప్పదలచుకొన్నప్పుడు కూడా ఇటువంటి ప్రయోగం బాగా ఉపయోగపడుతుంది. విశ్వనాథ వారు ఇటువంటి ప్రయోగాల్ని కల్పవృక్షంలో చాలా చోట్ల చేసారు.

0 comments

Jul 2, 2009

అంతటరాజు శాంతమృదుహాసముఁ జేసెను శాంతఁ గాంచుచున్

దశరథుఁ డంతఃపురములకేగి పాయసమును రాణులకు పంచియిచ్చుట
గీ.
చెఱువులోఁ బూలు చేతులఁ జిమ్ముకొంచుఁ
గడకుఁ జేరం జను నీఁతగాఁడువోలె
నెదురయిన నవ్వు మొగముల యిఱకటమున
రాజు నీఁదుచు నంతిపురంబుఁ జేరె. 118
శాంత యెదురుగా వచ్చింది. ధశరథుడామెతో
శా.
అమ్మా ! నీ వొకదైవమై వెలసినా వస్మద్గృహమ్మందు నీ
వ మ్మౌనిన్ గొని వెంటవచ్చితివి పుత్త్రావాప్తికై నా కటం
చు మ్మోదమ్మునెసంగఁ బట్టమహిషింజూపొంద నీ విద్ది కై
కొమ్మా ! పాయసమంచు నర్థమొసగెన్ క్షోణీశ్వరుండామెకున్. 120

కౌసల్యకు సగం పాయసాన్నిచ్చాడట. ఆ పాయసాన్ని కౌసల్య ఆరగించింది.
ఉ.
అంతటరాజు శాంతమృదుహాసముఁ జేసెను శాంతఁ గాంచుచున్
శాంతయు మందహాస రుచిసంపదఁ జూపెను రాజుఁ గాంచుచన్
ప్రాంత చరత్త్ర పా లవ విరాజితలోచనవారిజాత శ్రీ
కాంతవిభాసి నవ్వెసఁగఁ గాంచె మహాసతి తండ్రికూఁతులన్. 123

దశరథుడు శాంతను చూసి శాంతమృదుహాసాన్ని చేసాడట. బదులుగా శాంత కూడా రాజును చూసి మందహాస రుచిసంపదను చూపినదట. వారిద్దరినీ నవ్వుతూ కౌసల్య చూసినదట. ఇక్కడో పెద్దసమాసాన్ని వేసారు విశ్వనాధ.
ప్రాంత చరత్త్ర పా లవ విరాజితలోచనవారిజాత శ్రీకాంతవిభాసి అంటూను.దీని అర్థం నాకు తెలియలేదు.
ఉ.
నవ్వుచు నేగె రాజు లలనామణియైన సుమిత్రమేడకున్
బువ్వలరారుబోఁడిఁ గనఁబోవక చేఁగలపాయసంబునం
దవ్వరవర్ణినీ మణికి నర్థము వేఱుగ నేర్పఱించి జౌ
జవ్వున నూఁగుచిత్తమున సాగెను కేకయరాజపుత్త్రి కై.124

అక్కడ సుమిత్ర కనబడకపోయేసరికి ఆమె కోసం సగం వేఱుగా నుంచి మిగిలినదానితో కైకేయీ గృహానికి వెళ్ళాడు రాజు.
క.
అలచేఁ గలిగిన దానన్
జలజాయతనేత్ర కొసఁగె సగము నిలేశుం
డలఘుతరగాఢనిష్ఠా
ప్రలుబ్ధకై కేయి తినియెఁ బాయసమంతన్. 125

తన దగ్గఱనున్న దానిలో సగం కైకేయి కిస్తే ఆమె దానిని ఆరగించింది. అలఘుతరగాఢనిష్ఠాప్రలుబ్ధ ట కైకేయి.
క.
మగిడి చనుదెంచి కనుగొని
జగతీపతియున్ సుమిత్రఁ జానా ! నీకై
సగముంచితినే యదియును
మిగిలినదియున్ భుజింపుమీ యని యొసగెన్.126

తిరిగి సుమిత్ర దగ్గఱకొచ్చి ఇందాక తనకొఱకుంచిన సగమూ ఈ మిగిలిన సగమూ తినమంటాడామెను. కాని ఆమె ముందుగా కౌసల్యతినాలి కదా అంటుంది. కౌసల్య తిన్నదని చెప్తాడు. అప్పుడామె---
శా.
కౌసల్యాతనుజాతుఁడైన ప్రభువున్ గారాము మిత్రంబుగా
నై సేవించెడువాడు నా కడుపునం దావిర్భవింపంగ నే
నాసింతున్ భవదీయసత్కరుణచే నంచున్ మహాభక్తితోఁ
బ్రాసించెన్ బరిధూతకల్మష సుమిత్రాదేవి తద్భాగముల్. 128

ఆ విధంగా ముగ్గురు రాణులకూ పాయసాన్ని దశరథుడు పంచి పెట్టటం జరిగింది.

0 comments

Jul 1, 2009

క్షీరాబ్ధితరఁగలో శ్రీపయోధరములో

వారింకా తమ కష్టాలనిలా చెప్పుకుంటున్నారు
గీ.
దానవుల కడకత్తెరలోని పోఁక
చందమగు నేను ప్రాణాలు జవుకు జవుకు
గాఁగ--42.
క.
మధుసూదన ! నేను నుష
ర్బుధుడును దేవతల మనుట పోయి పదార్థ
ప్రథ మిగిలినాము జ్ఞానాం
బుధి మిగిలినాము ముదురుపాకమునఁబడి యచటన్.43
క.
ఇటు వేదములను జరివెద
రటుల బృహస్పతిమతంబు నగ్గింతురు నొ
క్కట వారిఁ బట్టవచ్చునె
చిటారుకొమ్మెక్కినారు శ్రీదర్పితులై. 44
గీ.
తల్లి చెవులను ద్రెంచెడు దట్టునకును
బిన్నతల్లి చెవుల్ సన్నబీరపూవు 48

ఉ.
మేరలు దాఁటియున్ బిదప మేలిమి యూఁదిన చిన్నమెత్తు బం
గారము తొల్త---55

కేశవుడు ప్రజాపతి పురుషుని చేతిలో నున్న పాయసం లోనికి ప్రవేసించిన ఘట్టంలో--

సీ.
ప్రామిన్కుగమిఁ బంటఁబట్టి నీళ్ళులఁ ద్రవ్వు
కొనిపోవు నసుర వెన్కొనిన మీను
శరధిలో మున్ను మంథర మాఁడ బైడిప్పఁ
గుదురుచేసిన చిన్న కూర్మరాజు
హేమాక్షుఁడను తుంగ నెగచి ముట్టియను బా
తాళంబు గ్రుమ్మిన దట్టుపోత్రి
స్తంభంబున సకలాంతర్యామితకు సాక్ష్య
ముగఁ జీల్చి వెలసిన మృగ విభుండు
గీ.
విఱిచి పెరిగించుం దననేర్పు వెలయ క్షత్ర
జాతిఁ బోకార్చి వెలయింపఁ జాలుటకును
బరశుధనువులతో మూర్తిపట్టు వెలుఁగు
జనపతికరస్థ మగు పాయసమునఁ జొచ్చె. 111
సీ.
క్షీరాబ్ధితరఁగలో శ్రీపయోధరములో
తొలి పాముపొలసులోఁ దూఁగు శయ్య
చలువవెన్నెలచాలొ మలయు నెండలవాలొ
యగ్గిమంటలడాలొ నిగ్గుచూపు
ప్రామిన్కుల చివళ్ళొ బహుళసృష్టి మొదళ్ళొ
యచ్చ తెల్వి కరళ్ళొ యసలుమూర్తి
తెఱగంట్లహాళికో దితిజాళిమోళికో
వట్టిన కేళికో వచ్చునటన
గీ.
ఇల్లు వైకుంఠమందొ మౌనీంద్రుహృదయ
మందొ తనదహరాకాశమందొ యైన
చిత్తు నానందమును మించు సత్తొకండు
జనపతికరస్థ మగు పాయసమున జొచ్చె.112

పోతన గారిని జ్ఞాపకం చేస్తున్నారు విశ్వనాధ.

0 comments

విశ్వనాధ గారు వాడిన అరుదైన ఛందో ప్రక్రియలు

శ్రీమద్రామాయణ కల్పవృక్షము- విశ్వనాధ వారు ఉపయోగించిన అరుదుగా వాడే ఛందో ప్రక్రియలు

అందరు కవులూ సాధారణంగా వారి వారి కావ్యాలలో ఉపయోగించే ఛందస్సులు ఉత్పల,చంపక మాలలు; మత్తేభశార్దూలాలు; ఆటవెలది, తేటగీతులు; సీస,కంద పద్యాలు. ఎక్కడైనా ఒకటో అరో ఇతర ఛందస్సులను కూడా అక్కడోటీ అక్కడోటీగా బహు తక్కువగా వాడుతుంటారు.కాని విశ్వనాధ వారు వారి రామాయణ కల్పవృక్షంలో ఇతర ఛందస్సులను కూడా ఎక్కువ ధారాళంగానే వాడారు. వారి రామాయణం చదువు తుంటే పాఠకుల సౌకర్యార్థం వారు వాడిన ఛందస్సులనన్నింటినీ ఓచోట ఏర్చికూర్చితే ఎలాగుంటుందనే ఊహ కలిగింది. అందుకే ఆవిషయం గురించే ఈ ప్రత్యేకమైన టపా.
నెం. చందస్సు గణవిభజన వళి
1।అంతరాక్కఱ(1సూర్యగణము, 2ఇంద్రగణములు, 1చంద్రగణము మొత్తం 4గణములుంటాయి నాల్గవ గణాధ్యక్షరం యతి.ప్రాస నియమం కలదు)
లమిత్రుండు సురరాజణ యుగంబు
లశత్రునితోఁ జెంది కందళింప
రుఁ బ్రావళ్ళు నర్థంబు తిశయిల్ల
ల మగు నంతరాక్కర
బ్ధిసంఖ్య.

2.అజిత ప్రతాపము(స, జ, స, స, బేసి పాదములకు,న, భ, జ, భ సరిపాదములకు).ప్రాసనియమం కలదు.పాదమునకు 12 అక్షరములు.ప్రాస నియమం కలదు
సాగణావలిఁ బ్రసన్న నభా
గ్రరపంక్తి నభిరామరూపమై
జితప్రతాపచెలువారుఁ గృతి
న్వియవిక్రమణ విశ్వభూవరా.


3.అపరాజితము (న, న, ర, స, వ) 9
(శక్వరీచ్ఛందం) పాదమునకు 14 అక్షరములు.ప్రాస నియమం కలదు.
రసలగముల్ దర్చిన సత్కృతిం
రఁగ నపరాజితంబు కవిస్తుతిన్.

4।అలసగతి

५.అల్పాక్కఱ(3 గణములు,
2 ఇంద్రగణములు,1 చంద్రగణము.3వ గణాద్యక్షరము యతి.)
*సునఃపతియుగము సోముండును
నెకంగఁ బ్రావళ్ళు నిండిమీఱ
నీయవిభవంబుగాంచునెప్డు
ణీయ మల్పాక్కము కృతుల.
*ఇది గీత పద్యము వలె నున్నది।

6.అశ్వగతి ( భ,భ,భ,భ,భ,గ)10

7.అశ్వలలితము (న, జ, భ, జ, భ, జ, భ, వ)12(వికృతిచ్ఛందం) పాదమునకు 23 అక్షరములు.ప్రాస నియమం కలదు.
భజము ల్భజంబులకు చ్చి భస్థలగయుక్తమై రవియతిం
బ్రనితమైన నశ్వలలితంబు రాజకులదీప ధీజననుతా.

8.అశ్వవిలసితము
9.అష్టమూర్తి (మ, న, త, స, ర, భ, జ, య)
10.అసంబాధ (మ, త, న, స, గ, గ) 12

11.ఆటవెలది(బేసి పాదములలో3 సూర్యగణములు,2 ఇంద్ర గణములు, సరిపాదములలో 5సూర్యగణములు) ప్రాస లేదు నాల్గవ గణాద్యక్షరం యతి.
ప్రాసయతి చెల్లును
నగణత్రయంబు నింద్ర ద్వయంబును
హంస పంచకంబు నాటవెలది

12.ఆపాతలిక
13.ఆర్య

14.ఇంద్రవజ్రము (త, త, జ, గ, గ) 8(త్రి ష్టుప్ఛందము) పాదమునకు 11 అక్షరములు. ప్రాసనియమం కలదు.తాజగానిర్మితి నింద్రవజ్రా - నీతాఖ్య వర్తించు వినిర్మలోక్తిన్.

15.ఇంద్రవంశము (త, త, జ, ర) 8 (జగతీచ్ఛందం) పాదమునకు 12 అక్షరములుండును.ప్రాస నియమం కలదు.
తా జ రా కల్పన నింద్రవంశకా
ఖ్యాతాఖ్య మయ్యెన్ బరగండభైరవా.

16.ఇల
17.ఉత్కలిక

18.ఉత్పలమాల (భ, ర, న, భ, భ, ర, ల, గ) 10
(కృతిచ్ఛందం)పాదమునకు 20 అక్షరములు.ప్రాస నియమం కలదు.
భానుసమాన విన్భరన భారలగంబుల గూడి విశ్రమ
స్థాము నందు బద్మజ యుతంబుగ నుత్పలమాలయై చనున్.

19.ఉత్సాహము
గీ.
హగణనగణంబు లేడు గుర్వంతమగుచు
వి స్తరిల్లిన నుత్సాహవృత్తమయ్యె;
దీనితుద గీతియొకఁడు సంధింప విషమ
సీస మిత్తెఱఁగెఱుఁగుట చెలువుమతికి.
ఉత్సాహము.
ఓసరించుఁ బజ్జ లజ్జ లుజ్జుగించు రాజులన్
వేసరించు గర్వపర్వవేషభూషితారులన్
వాసవానుకార వీరవర్య విశ్వభూప నీ
భాసురాసిధేనుకానుభావ మాహవంబులన్.

20.ఏకరూప

21.కందము
కంము త్రిశర గణంబుల, నంము గా భ జ స లముటవడి మూటన్
బొందును నలజల నాఱిట, నొందుం దుద గురువు జగణ ముండదు బేసిన్.
అందును గందంబులు నా
నందంబులు భజనలగాఖ్యలచే వా
నిం గు నెఱుగం బ్రాసము
ముందుగ నిడి మూఁడు నైదు మూడున్నైదున్.

ఆదిమ వర్ణము వళి నిడు
పై దొరకినఁ గుఱుచయైన నట్టుల తత్త
త్పాదాదుల నిలుపందగు
గాదిలిగాఁ జెప్పఁ దలఁచు కందంబులన్.

నిడుదలగు పాదములకును
వడి నాలవగణము మొదల వలయు నిలుప న
క్కడలను గురువును మూఁడవ
యెడ నలజలలోన నొకటి నిడ బెడఁగడరున్.

*ఇందు పుర బాణనగముల
కందువ జగణంబు నిలుపఁగా గా దెపుడుం
గందములకు నార్యాదుల
చందం బధికంబు వానిఁ జనుఁ దెలియంగన్.
*
ఇందు=1, పుర=3, బాణ=5, నగములు=7

కందము నర్థంబులతుద
నందినగురు వుడుపఁ బథ్య యగు నాఱవచోఁ
జెందిన జగణము లత్వముఁ
బొందిన నది యార్యయనఁగఁ బొసఁగుంగృతులన్.

క్రమమునఁ బథ్యార్యార్థము
లమరంగా వీడుపడిన నది గాథాభే
దముగాఁగం బరఁగు ప్రపం
చము తెనుఁగునఁ జెప్పరండ్రు చతురులు కృతులన్.


22.కపాలి
23.కమలనగీతి
24.కవికంఠభూషణము

25.కవిరాజ విరాజితము (న, జ, జ, జ, జ, జ, జ, ల,గ) 8,7,7 మఱియు ఇంకొక పక్షమున 8, 14
(వికృతిచ్ఛందం) పాదమునకు 23 అక్షరములు.ప్రాస నియమం కలదు.
క్రమున నొక్క నకారము నాఱుజకారములున్ బరగంగ వకా
మును నొడంబడి రా గవిరాజ విరాజిత మన్నది రామ నిభా.

26.కర్ణాటచతుష్పదము
27.కరిబృంహితము( భ, న, భ, న, ర ) 13 ( అతిశక్వరి ఛందము) పాదమునకు 15 అక్షరములు. ప్రాస నియమం కలదు.
28.కిరీటము
29.కుసుమవిచిత్రము
30.కౌముది

31.ఖచరప్లుతము ( స, భ, భ, మ, స, స, వ)
12(కృతిచ్ఛందం)పాదమునకు 20 అక్షరములు.ప్రాస నియమం కలదు.
భభముల్ మససంబు లగాప్తి న్నాగవిభూషణయుగ్యతిన్
శుభదమై ఖచరప్లుత మొప్పు న్సోమకులార్ణవచంద్రమా.

32.గజవిలసితము
33.చంచరీకావళి (మ, మ, ర, ర, గ) 7

34.చంద్రకళ (ర, స, స, త, జ, జ, గ)11
(అతిధృతిచ్ఛందం)పాదమునకు 19 అక్షరములు.ప్రాస నియమం కలదు.
వ్యక్తరీతి రసాతజజగ్రాత్త గకారనిరూఢిచే
క్త దిగ్విరమంబన నొప్పుం జంద్రకళాహ్వయమై ధరన్.

35.చంద్రరేఖ

36.చంద్రిక (న, న, త, ర, గ) 8
చంద్రిక(న, న, ర, వ) 7
(త్రి ష్టుప్ఛందము) పాదమునకు 11 అక్షరములు. ప్రాసనియమం కలదు.
లితముగఁ జంద్రికాహ్వయం
రు ననరవాంక మై కృతిన్.

37.చంద్రవర్త్మ


38.చంపకమాల (న, జ, భ, జ, జ, జ, ర) 11(ప్రకృతిచ్ఛందం) పాదమునకు 21 అక్షరములు.ప్రాస నియమం కలదు.
భజజ్జలరేఫలు పెనంగి దిశాయతి తోడ గూడినన్
త్రి
గదభిష్టుతా బుధనిధీ విను చంపకమాలయై చనున్
.

39.చపల
40.చతుష్పద
41.చామరము

42.చిత్రపదము(భ, భ, గ, గ) (అనుష్టుప్ఛందము) పాదమునకు 8 అక్షరములు.ప్రాస నియమము కలదు.
చిత్రపదం బన భాగా - చిత్రయతిప్రతిపత్తిన్.

43.జఘనచపల

44.జలదము (భ, ర, న, భ, గ) 10
(అతిజగతీచ్ఛందం) పాదమునకు 13 అక్షరములు.ప్రాస నియమం కలదు.
ర నంబుల న్భగురు లెక్కుచు నిం
పై జియించె నేని జలదాహ్వయ మౌ.

45.జలధరమాల (మ, భ, స, మ) 9(జగతీచ్ఛందం) పాదమునకు 12 అక్షరములుండును.ప్రాస నియమం కలదు.
మాద్యత్ప్రీతిం జలధరమాలాభిఖ్యం
బ్రద్యోతించున్ మ భ స మ ద్రాప్తిన్.

46.జలోద్ధతగతి (జ,స, జ,స)

47.తరలము(ధృవకోకిల)( న, భ, ర, స, జ, జ, గ)12
(అతిధృతిచ్ఛందం)పాదమునకు 19 అక్షరములు.ప్రాస నియమం కలదు.
రసంబులు జాగవర్గము చ్చి యీశ్వరవిశ్రమ
ప్రవమై తరలం బనంజను రాజవంశశిఖామణీ.

48.తరళము (భ, స, న, జ, న, ర) 11
చారుభసన భూరి జన రసాంద్రగణములన్ దిగా
సా విరతినందముగ నిజంబు వరలి చెన్నగున్.

49.తన్వి
50.త్రిపద
51.తురగము

52.తురగవల్గితవృత్తం(న, న, న, న, స, జ, జ, గ)15(ఆకృతిచ్ఛందం) పాదమునకు 22 అక్షరములు.ప్రాస నియమం కలదు.
మెఱయు న న న న స జ జ గములను మేలుగా రచియించినన్
ఱలు మనుయతి వలనను దురగల్గితంబను వృత్తమై.

53.తేటగీతి
సూర్యుడొక్కరుండు సురరాజులిద్దరు
దినకరద్వయంబు తేటగీతి. 1సూర్యగణము, 2 ఇంద్రగణములు, 2 సూర్యగణములు. ప్రాస లేదు. యతి నాల్గవగణాద్యక్షరము యతి. ప్రాసయతి చెల్లును.

54.తోటకము (స, స, స, స) 9(జగతీచ్ఛందం) పాదమునకు 12 అక్షరములుండును.ప్రాస నియమం కలదు.
సం బయి సాసససంభృతంమై
విచించినఁ దోటకవృత్తమగున్.

55.తోదకము (భ,భ,భ,గ,గ)7
(త్రి ష్టుప్ఛందము) పాదమునకు 11 అక్షరములు. ప్రాసనియమం
కామితభత్రయ గాయుత మై వి
శ్రాపుఁ దోదక సంజ్ఞతఁ జెందున్.
తోదకము(న, జ, జ, య) 8
(జగతీచ్ఛందం) పాదమునకు 12 అక్షరములుండును.ప్రాస నియమం కలదు.
లిత మైన నజాయగణంబుల్
విసిత తోదకవృత్తముఁ జెప్పున్.

56.త్వరితపదగతి(న, న, న, న, న, గ, గ)11(అత్యష్టిచ్ఛందం)పాదమునకు 17 అక్షరములు.ప్రాస నియమం కలదు.
త్వరితపదగతి యనఁగఁ గు న న న నాగా
విరచితయు దశమయతి విలసితయు నైనన్.

57.త్రిభంగి(న, న, న, న, న, న, స, స, భ, మ, స, గ) చత్వారింశన్మాత్రాగర్భితపాదంబు. పాదమునకు 34 అక్షరములు.
లి న న న న స న ములు ససభమములు నతిసగయుక్తిఁ జరింపం బ్రసరింపం బాటివహింపం
జెలువుగనవకలి నిలుపఁగదగునెడ వెలయుఁద్రిభంగి సురక్తిం బదభక్తిం బ్రాసనియుక్తిన్.

58.దుర్మిలా

59.దృతవిలంబితము (న, భ, భ, ర) 7
(జగతీచ్ఛందం) పాదమునకు 12 అక్షరములుండును.ప్రాస నియమం కలదు.
ద్రువిలంబితరూపితవృత్తిచేన్
బ్రతమయ్యె నభారగణంబులన్.

60.ద్విపద
ఇంద్ర గణములు మూఁ డిన గణంబొకటి
చంద్రాస్య ! ద్విపదకుఁను చెప్పరేచ
ద్విదకు ద్విపదకుఁ దెగ జెప్పవలయు
నెపుడు సంస్కృతమున నితర భాషలను
తుల లోపలఁ బ్రాసతి దక్క సకల
తులు చెల్లును బ్రయో గాతి సారమున
ద్విద తో ద్విపద సంధిల నేకశబ్ద
పుడు రెంటను గూర్ప ది యయుక్తంబు

61.ద్విరదగతి
62.దోధకము
63.ధరణి
64.ధరణిధరగతి
65.ధృతమధ్య

66.నదీప్రఘోషము(ర, ర, ర, ర, -మొదటి పాదము,-జ, త, జ, ర మిగిలిన 3 పాదములు) స్వస్థాన విషమ వృత్తము
భారంబుల్మొగిం బ్రాగుపేతంబులై
రించుచుండం జతస్థరేఫలం
త్రిపాదంబులఁ ర్వునొప్పుఁగన్
దిరంబుగా మూఁట నదీప్రఘోషమై.

67.నరేంద్ర

68.నర్కుటము(న, జ, భ, జ, జ, వ)11
(అత్యష్టిచ్ఛందం)పాదమునకు 17 అక్షరములు.ప్రాస నియమం కలదు.
జభజముల్ జవంబులఁ ర్చిన నర్కుటక
ప్రజననమొప్పు దిగ్యతిని రాజకులాబ్ధిశశీ.

69.నవనందిని (స, జ, న, గ, గ) 9
70.నాగరము
71.నారాచము
72.నారీనుతము
73.నియోగిని
74.నిశా
75.పంక్తి

76.పంచచామరము (జ, ర, జ, ర, జ, గ) 10
త్వరాస దృగ్విధీయమాన దానతోయ శోషితాం
బురాశి వర్ధనాతి కృత్ప్రభూత కీర్తి మండల
స్ఫుత్సుధా మయూఖ వైరి భూమి భృచ్చిరోల్లస
త్కిరీట రత్న రాజితకాంతి దీపితాంఘ్రి పంకజా.

77.పంచపది
78.పథ్య
79.పణవము
80.పద్మనాభము (త, త, త, త, త, త, త, గ, గ)

81.ప్రగుణ వృత్తం(సుప్రతిష్ఠాచ్ఛందం) పాదమునకు 5 అక్షరములు. (స, గ, గ) ప్రాస నియమం కలదు.
ణాసక్తిం - గసంయుక్తిన్ - బ్రగుణాఖ్యంబై - తగు నింపారన్.

82.ప్రభాతము (న, జ, జ, ర, గ) 8
(అతిజగతీచ్ఛందం) పాదమునకు 13 అక్షరములు.ప్రాస నియమం కలదు.
మొల నజారగము ల్ప్రభాతసంజ్ఞం
బొవఁగ జేయు నపూర్వకల్పనోక్తిన్.

83.ప్రహేయము

84.ప్రమాణి (జ, ర, వ) (అనుష్టుప్ఛందము) పాదమునకు 8 అక్షరములు.ప్రాసనియమం కలదు.
కారమున్ రకారమున్ - వకారముం బ్రమాణికిన్.

85.ప్రహరణకలిత (న, న, భ, న, వ) 8
(శక్వరీచ్ఛందం) పాదమునకు 14 అక్షరములు.ప్రాస నియమం కలదు.
ప్రరణకలితంయి న స భ స వల్
హువిధయతులం బ్రథఁ జెలు వడరున్.

86.పరావతి
87.ప్రియంవద (స, భ, జ, ర)
88.పృథ్వి (జ, స, జ, స, య, ల, గ)
89.ఫలసదనము (న, న, న, న, స, గ)
90.బంధురము (న, న, స, స, స, భ, భ, గ)
91.భద్రకము (భ, ర, న, ర, న, ర, న, గ)

భద్రకము (ర, న, ర)(బృహతీచ్ఛందము) పాదమునకు తొమ్మిది అక్షరములు.ప్రాస నియమం కలదు.
ద్రకంబు రనరంబులన్ - భద్ర విశ్వనృపమన్మథా.

92.భాస్కరవిలసితము(భ, న, జ, య, భ, న, న, స, గ, గ)13(అభికృతిచ్ఛందం) పాదమునకు 25 అక్షరములు.ప్రాస నియమం కలదు.
సాసహితయతి సంగతవృత్తి స్సంచిత భ న జ య భ న న స గం బుల్
పౌవకులజలరాశిమృగాంకా, భాస్కరవిలసిత మన విలసిల్లున్.

93.భుజంగప్రయాతము (య, య, య, య)8 (జగతీచ్ఛందం) పాదమునకు 12 అక్షరములుండును.ప్రాస నియమం కలదు.
భుజంగప్రయాతంబు పొం దారు నందం
స్రంబుగా నయ్యయాయంబు లొందన్.

94.భుజంగవిజృంభితము(మ, మ, త, న, న, న, ర, స, వ)10(ఉత్కృతిచ్ఛందం) పాదమునకు 26 అక్షరములు. ప్రాసనియమం కలదు.
ధీవైదగ్ధ్య శ్రీవిక్రాంతా దిగిభదశమపదవిరతిన్ భుజంగవిజృంభితం
బై విశ్రాంతుల్ దైవాఱం జెన్నగు మ మ త న న ర స హారియై లగసంయుతిన్.

95.భుజగశిశిరుతము( న, న, య) (బృహతీచ్ఛందము) పాదమునకు తొమ్మిది అక్షరములు. ప్రాస నియమం కలదు. భుగశిశురుత మయ్యెన్ - ఋజు ననయ ములచేతన్.

96.భూనుతము (ర, న, న, భ, గ, గ) 10
(శక్వరీచ్ఛందం) పాదమునకు 14 అక్షరములు.ప్రాస నియమం కలదు.
అంమై ర న న భ తతి నంది గగంబుల్
పొందఁగా బదగతిఁగని భూనుతమయ్యెన్.

97.భోగినివిలసితము
98.భ్రమరవిలసితము

99.మంగళమహాశ్రీ (భ, జ, స,న, భ, జ, స, న, గ, గ) 9, 17(ఉత్కృతిచ్ఛందం) పాదమునకు 26 అక్షరములు. ప్రాస నియమం కలదు.
త్తుగను రత్నముల ప్తదశమంబునను ద్యతులు మంగళమహాశ్రీ
వృత్తమున కౌభజసవృత్తిన భజల్మనలపై గురులురంగనృపధీరా.

100.మందాక్రాంత (మ, భ, న, త, త, గ,గ) 11
(అత్యష్టిచ్ఛందం)పాదమునకు 17 అక్షరములు.ప్రాస నియమం కలదు.
కాంతా కాంతా మభనతతగా క్రాంత సంక్రాంత మందా
క్రాంతంబయ్యెన్ విరమదశమాక్రాంతి విశ్రాంత మైనన్.

101.మంజరి
102.మంజుభాషిణి (స, జ, న, జ, గ, గ) 9

103.మణిభూషణము (ర, న, భ, భ, ర)10
(అతిశక్వరీచ్ఛందం) పాదమునకు15అక్షరములు.ప్రాస నియమం కలదు
విశ్వభూప మణిభూషణవృత్త మనంజనున్
శ్వదుక్త ర న భా ర దిశాయతిఁగూడినన్.

104.మణిమాల (స, జ, స, జ, స, జ, స)10(ప్రకృతిచ్ఛందం).పాదమునకు 21 అక్షరములు.ప్రాస నియమం కలదు.
రుసన్ సజత్రితయము న్బ్రసక్త సగణంబుతోడ నొనరం
రఁగున్ దిగంతవిరతిం బ్రధానపదమై చళుక్యమదనా.

105.మణిరంగము (ర,స,స,గ)

106.మత్తకోకిల (ర, స, జ, జ, భ, ర) 11
(అత్యష్టిచ్ఛందం)పాదమునకు 17 అక్షరములు.ప్రాస నియమం కలదు.
త్తయౌ రసజాభరల్ భవసంఖ్య విశ్రమ మొప్పినన్
త్తకోకిల వృత్తమౌన సమానరంగనృపాలకా.

107.మత్త మయూరము (మ, త, య, స, గ)8
(అతిజగతీచ్ఛందం) పాదమునకు 13 అక్షరములు.ప్రాస నియమం కలదు.
సంబోదార్థంబై వలన్మత్త మయూరా
ఖ్యం బింపొప్పారున్ మతయాగ్య్రాత్త సగాప్తిన్.
మత్తమయూరము (న, న, భ, భ, గ) 8

108.మత్తాక్రీడ

109.మత్తేభవిక్రీడితము (స, భ, ర, న, మ, య, వ)14
(కృతిచ్ఛందం)పాదమునకు 20 అక్షరములు.ప్రాస నియమం కలదు.
లువొందన్ సభరల్ నమల్యవల తోనంగూడి మత్తేభ మిం
లరారున్ బదునాలు గౌ విరతి చే నానందరంగా ధిపా.

110.మథ్యాక్కఱ
111.మదరేఖ
112.మదనదర్పణము
113.మద్రకము
114.మధ్యాక్కఱ(
రవీంద్రచంద్రాఖ్య గణాలలో 6 గణములు ఉంటాయి, 2 ఇంద్ర గణములు,1 సూర్యగణము,2 ఇంద్ర గణములు, 1 సూర్యగణము, నాల్గవ గణాద్యక్షరము యతి)
సురాజ యుగముతోగూడి సూర్యుతో నొడబడి యుండి
సురాజ యుగముతోగూడి సూర్యుతో నొడబడి వెండి
మొప్ప నీపాట నాఱు ణముల మధ్యాక్కరంబు
విచింప బ్రావళ్ళు నిట్లు వెలయఁ గవిజనాశ్రయుండ.(నన్నయ గారు 5వగణాద్యక్షరం యతి వేసిరి)

115.మధుమతి(మదనవిలసితము)
116.మధురగతిరగడ (నాలుగు మాత్రలు నాటిన గణములు, నాలుగు రెంటికి నలి విరమణలు
గలసి మధురగతి కనలును జగణము, తొలగిన ధృతకౌస్తుభ కవిరమణము)

117।మధురాక్కఱ(
రవీంద్రచంద్రాఖ్య గణాలలో 5 గణములు ఉంటాయి,3 ఇంద్ర గణములు,2 సూర్యగణములు,నాల్గవ గణాద్యక్షరము యతి)
ణి వాసవ త్రితయంబు ధవళ భానుయుతి నొంద
నితి విశ్రాంతి నాలవనెలవున నింపుమీఱ
సమధురార్ధములఁ జెప్పఁ జను మధురాక్కరంబు
రుసఁ బంచగణములను వాలి కృతుల వెలయు।

118.మనోరమ
119.మనోహర

120.మనోజ్ఞము (న, జ, జ, భ, ర)10
(అతిశక్వరీచ్ఛందం) పాదమునకు15అక్షరములు.ప్రాస నియమం కలదు
రుస మనోజ్ఞమనంగ చ్చు నజాభర
స్థిగతిఁ బంకజభూయతిం బ్రతిపన్నమై.


121।మహాక్కఱ(రవీంద్రచంద్రాఖ్య గణాలలో 7 గణములు ఉంటాయి, 1 ఇనగణము,5 ఇంద్రగణములు, 1చంద్రగణము)
వారిజాప్తుండు పంచేంద్రగణములు జారియును గూడి వెలయుచుండ
నారయ రెండవ నాలవచోట్ల నర్కుండయినుం దనర్చుచుండఁ
గోరి యవ్వడిపంచమగణమునఁ గూడి మొదల నిలుపంగ నగు
సారమై ప్రాసవడి సప్తగణములు సాఁగ మహాక్కర యతిశయిల్లు।


122.మహాస్రగ్ధర (స, త, త, న, స, ర, ర, గ) 9, 16
(ఆకృతిచ్ఛందం) పాదమునకు 22 అక్షరములు. ప్రాస నియమం కలదు.
హిఖండగ్లౌకళా విశ్రమములను మహాస్రగ్ధరా వృత్తమౌ శ్రీ
హితౌ దార్యాసతానల్ రర గురువులున్ శ్రీరంగ రంగభూపా.

123.మానిని (భ, భ, భ, భ, భ, భ, భ, గ) 7, 13,19
(ఆకృతిచ్ఛందం) పాదమునకు 22 అక్షరములు. ప్రాస నియమం కలదు.
కాము లున్క్రియ న్గొన నేడు భ కారములొక్క గకారముతో
గావమై చన గావళు లన్నియు ల్గిన మానిని కామ నిభా.

124.మాలిని (న, న, మ, య, య) 9
(అతిశక్వరీచ్ఛందం) పాదమునకు15అక్షరములు.ప్రాస నియమం కలదు
విరమణ యుక్తిన్ నామయాసంగతం బై
ని దగును మాలిన్యాఖ్య చేరంగ ధీరం .

125.ముఖచపల
126.మేఘవిలసితము

127.మేఘవిస్ఫూర్జితము (య, మ, న, స, ర, ర, గ)12
(అతిధృతిచ్ఛందం)పాదమునకు 19 అక్షరములు. ప్రాస నియమం కలదు.
మృదున్యస్తార్థంబై దినకరయతి న్మేఘవిస్ఫూరితాఖ్యం
బుదాత్తశ్రీఁ జేర్చున్ యమనసర ప్రోత గప్రాప్తిచేతన్.

128.మేదిని (న, జ, భ, జ, ర, గ)11
(అష్టిచ్ఛందం) పాదమునకు16అక్షరములు.ప్రాస నియమం కలదు
జ భ జ రేఫగంబునఁ దర్చు మేదినీవృ
త్తజనికి మూలమై దిగుదిస్థ విశ్రమం బై

129.రథగమన మనోహరము

130.రథోద్ధతము(నరాంతికము) (ర, న, ర, ల, గ)
7 (త్రి ష్టుప్ఛందము) పాదమునకు 11 అక్షరములు. ప్రాసనియమం కలదు.
క్తిఁ బేర్చి రనరంబు పై లగం

బుక్త మైనను రథోద్ధతం బగున్.

131.రసాలి

132.రుగ్మవతి (భ,మ,స,గ) 6 (పంక్తిచ్ఛందము) పాదమునకు 10 అక్షరములు.ప్రాస నియమం కలదు.
రుగ్మవతిం జేరున్ భమసంబుల్ - తిగ్మరుచిద్యుద్దీప్త గయుక్తిన్.

133.లయగ్రాహి(భ, జ, స, న, భ, జ, స, న, భ, య) పాదమునకు 24 మాత్రలు ,30 అక్షరములు 9 అక్షరముల కొక ప్రాస యతి
మ్మె వెలయన్ భజసమ్ములు మఱిన్ భజసమ్ముల పయిన్ భయగమ్ములు లయగ్రా
హిమ్మఱయు రంగనృప ! యిమ్మహిని బ్రాసయతులెమ్మెఱపి నాల్గు చరమ్ములను వేడ్కన్.

134.లయహారి(న, న, న, న, న, న, న, న, న, న, న, స, గ) 10 పైఁ బ్రాసయతి,పాదమునకు 37 అక్షరములు, చత్వారింశన్మాత్రాగర్భితపాదంబు
దునొకఁడు నగణములఁ బొదలి సగణము గురువు
మృదులపదరచనఁ దగి యొదవి మితివ్రాలన్
ముమొసఁగు సభల నని చదువుదురు కవివరులు
హృయములఁ జతురతలుగదుర లయహారిన్.

135.లాటీవిటము (స, స, స, స, మ, త, య)13(ప్రకృతిచ్ఛందం).పాదమునకు 21 అక్షరములు.ప్రాస నియమం కలదు.
సా మత యంబులు భానుయతి న్సాకంబై లాటీవిటవృత్తం
బెకంబెసగున్ విరచించిన విశ్వేశా, చాళుక్యక్షితిపాలా.

136.వంశస్థము(జ, త, జ, ర) 8
(జగతీచ్ఛందం) పాదమునకు 12 అక్షరములుండును.ప్రాస నియమం కలదు.
తంబులం జెందిన జంబు రేభయున్
నుతింప వంశస్థ మనుక్రమక్రియన్.

137.వనమయూరము (భ, జ, స, న, గ, గ) 9
(శక్వరీచ్ఛందం) పాదమునకు 14 అక్షరములు.ప్రాస నియమం కలదు.
న్నతములై వనమయూర కృతిలోలిన్
న్నగ భజంబుల పయిన్ సనగగం బుల్
చెన్నొదవ దంతి యతి చెంది యలరారున్
వెన్నుని నుతింతురు వివేకు లతి భక్తిన్.

138.వరాహము

139.వసంత తిలకము (త, భ, జ, జ, గ,గ) 8 (శక్వరీచ్ఛందం) పాదమునకు 14 అక్షరములు.ప్రాస నియమం కలదు.
స్థాపించినం ద భ జ జంబు చళుక్య విశ్వ
క్ష్మాపా వసంతతిలకంబగు గా నియుక్తిన్.

140.వాతోర్మి (మ, భ, త, ల, గ) 7
(త్రి ష్టుప్ఛందము) పాదమునకు 11 అక్షరములు.ప్రాస నియమం కలదు.
ద్వాతోర్మిన్ మభతంబుల్ లగమున్
ద్విశ్రామస్థితి సంధిల్లుచుండున్.

141.వితానము
142.విచికిలితము
143.విచిత్రము
144.విజయభద్రము
145.వితానము
146.వితాళచతుష్పద
147.విపుల

148.విభూతి వృత్తం (ర, జ, గ) పాదమునకు 7 అక్షరములు.(ఉష్ణిక్కుచ్ఛందం) ప్రాస నియమం కలదు.
స్వస్థ సద్విభూతి దా - రస్థ జస్థగంబునన్

149.విమానము
150.వియోగిని
151.విశ్వదేవి (మ, మ, య, య)8
(జగతీచ్ఛందం) పాదమునకు 12 అక్షరములుండును.ప్రాస నియమం కలదు.
మాయావర్ణం బొప్పం గ్రన్యాసవృత్తిన్
జేయున్ భూభృ ద్విశ్రాంతిచే విశ్వదేవిన్.

152.విచిత్ర వృత్తము (గాయత్రీచ్ఛందం) పాదమునకు 6 అక్షరములు.(య, య) ప్రాస నియమం కలదు.
విచిత్రంబునందున్ - రుచించున్ యయంబుల్.

153.విజయమంగళము
154.విషమసీసము
155.వ్రీడ
156.వృంత
157.వృషభగతి
158.వేగవతి
159.వైతాళీయము
160.శంభువృత్తము

161.శార్దూలవిక్రీడితము (మ, స, జ, స, త, త, గ) 13(అతిధృతిచ్ఛందం) పాదమునకు 19 అక్షరములు ప్రాస నియమము కలదు.
సారాచార విశారదాయి నయితిన్ శార్దూల విక్రీడితా
కారంబై మసజమ్ము లిమ్ముగ సతాప్రాప్తమై చెల్వగున్.

162.శాలూరము

163.శిఖరిణి (య, మ, న, స, భ, వ)12(అత్యష్టిచ్ఛందం)పాదమునకు 17 అక్షరములు.ప్రాస నియమం కలదు.
విస్వ ద్విశ్రాంతి న్య న స భ వా విష్కృతగతిం
విశ్రేణీరక్తిన్ శిఖరిణియనంగాఁ దగుఁబ్రథన్.

164.శ్రీరమణము(భ,మ,త,గ- మెదటిపాదము(ఉపక్రాంత), భ, భ, భ, గ,గ(నికటము) తరువాతి 3 పాదములు)పరస్థాన విషమ వృత్తము
భమవ్యాయత్తసగవ్యా
పాము నాదిమ పాదము సెందన్
జారు భభాగగసంగతిచేతన్
శ్రీమణంబని చెప్పిరి మూఁటన్.


165.శ్యేని (ర, జ, ర, వ) 7
(త్రి ష్టుప్ఛందము) పాదమునకు 11 అక్షరములు. ప్రాస నియమం కలదు.
శ్యేనికై రవంబు చెప్పి పైరవం
బూనఁజేయు టెల్ల నొప్పు నెప్పుడున్.

166.షట్పద
१६७.షట్పది
సురపతులిరువురు సురపతులిద్దఱు
సురపయుగమ్ముతో సోముండును
బరువడిఁబెనఁగొన నదురుగ షట్పది
సరిఁబ్రాసంబులు దనరారంగను.

168.సీసము

నల నగ సల భ ర త ల లో
పల నాఱిటి మీఁద రెండుఁ బద్మాప్త గణం
బులఁ దగి నాలుగు పదములఁ
జెలువగు నొక గీతి తోడ సీసము కృష్ణా !

ఇంద్రగణములారు ఇనగణంబులు రెండు

పాదపాదమందు పల్కుచుండు
ఆటవెలదినైన తేటగీతియు నైన
చెప్పవలయు మీద సీసమునకు
క.
అమరంగ విషమసీసము
సమసీసము లనఁగఁ రెండుచందము లందున్
బ్రమితమగు విషమసీస
క్రమ మెఱుఁగఁగవలయుఁ జతురకవిజనములకున్
.
గీ.
హగణనగణంబు లేడు గుర్వంతమగుచు
వి స్తరిల్లిన నుత్సాహవృత్తమయ్యె;
దీనితుద గీతియొకఁడు సంధింప విషమ
సీస మిత్తెఱఁగెఱుఁగుట చెలువుమతికి.
విషమ సీసము
గీ.
వడి దనర్పఁ బ్రాసవైభవం బలరార
నిట్ల గణనిరూఢి నెసక మెసఁగఁ
గీ ర్తితాతిమధురగీతియుఁ బైగల్గ
నదియ విషమసీసమండ్రు కృతుల.
సమసీసము
గీ.
వెలయు సమసీసములు పంచ విధములయ్యె
నరయ నవకలిసీ సాహ్వయంబుఁ, బ్రాస
సీస, మక్కిలిప్రాససీసాఖ్యసీస
ము,వడిసీస, మక్కిలివడిసీసమును ననంగ.
క.
తన పాదంబులు నాలుగు
మొనసిన పై గీతిపాదములు రెండును గా
నినుమూఁడై సీసమునకు
జను నడుగులు వ్రాలు వళ్ళు సరి యిన్నిటికిన్.
అవకలి సీసము
క.
అలవడిసీసము పాదము
నలుతునుకలు చేసి మూఁట నలనామగణం
బుల రెంటి నిడి య
వ్వలితునుక నహంబు లిడఁగవలయు న్వరుసన్.
సీ.
సామంబుచేఁ దుల్యభూమీశ్వరులు దన, తోడిమిత్రతకు నఱ్ఱాడుచుండ,
దానంబుచే నతిమానమానవనాథు లేర్పడ నక్కఱఁ దీర్చుచుండ,
ఖేదంబుచేత దుర్మోదమహీశు లందంద సంక్షిప్తత నొందుచుండ,
దండంబుచేత నుద్దండమాండలికు లాజ్ఞాచక్ర మౌదల మోచియుండ.
గీ.
శశ్వదనురక్తిఁ జాళుక్యవిశ్వనిభుఁడు
వాలి వసుమతి లీలమై నేలుననుచుఁ
జెప్ప నవకలిసీస మిట్లొప్పునండ్రు,
పూని గావ్యకళావేదులైనకవులు.

ప్రాస సీసము
క.
సీసమునకు నాఱడుగులఁ
బ్రాసము లిడి యోలి సర్వపదఖండములన్
భాసురముగ వళ్ళలవడఁ
జేసిన నది కృతులఁ బ్రాససీసంబయ్యెన్.
సీ.
చక్రవాళాచల చంద్రకాంతములకు సంతతార్ద్రత్వంబు జరపి జరపి,
చక్రీశలోక సంచర దురు సంతమసంబుల వడిఁ బాఱఁ జదిపి చదిపి,
శక్రేభశంకరశంకరాచలశశి చారుదీధుతులపైఁ జాఁగిచాఁగి,
చక్ర స్తనీకుచ సాంద్ర చంద్రనరసచర్చలపైఁ గేలి సలిపి సలిపి,
గీ.
విక్రమప్రతాప విశ్రుతమూర్తియై
విశ్వభూమివిభుని విశదకీర్తి
ప్రక్రమప్రసక్తిఁ బ్రసరించు నని చెప్పఁ
బ్రాససీస మనఁగ బరఁగు నెందు.

అక్కిలిప్రాససీసము
క.తుదిగీతి నాలుగడుగులు
వదలక ప్రాసంబు నిలిపి వళ్ళింపారం
గదిరినఁ గదురకయున్న
న్నది యక్కిలి ప్రాససీస మనఁగాఁ బరఁగున్.

సీ.
క్రమయుక్తి విద్యల కందువ యెఱుఁగుచుఁ, గవులనే ర్పారసి గారవించి,
సమరసంక్రీడనక్షమసుభటాటోప సంచారములకు నుత్సాహమూఁది,
నమితాహితక్షమానాథులరాజ్యంబు నాననాఁటి కొనర నున్నుచేసి,
ప్రముదితారాతుల భంజించి వేలుపుం బడఁతుల కిపారుపతులఁ జేసి,
గీ.
విమలకీర్తుల దిక్కులు విప్పనేర్చు
శమితవినుతుండు విశ్వేశచక్రవర్తి
సముచితంబుగ నని చాల సన్నుతింప
నమరు నక్కిలిప్రాససీసాహ్వయంబు.

వడిసీసము
క.
ఏపాదమునకు నే వడి
యాపాదింపంగఁబడియె నది ఖండములం
బ్రాపింపఁ జెప్పఁగ వళిని
రూపితసీసంబు నాఁగ రూఢికినెక్కున్.
సీ.
గ్రహదంష్ట్ర సోఁకని గ్రహరాజు, ప్రియవచః కథనంబు నేర్చినకల్పభూజ,
మలరుఁదూపులు కేల నంటని కందర్పు, డమ్ముచే నింకని యంబురాశి,
కన్నులు పెక్కులు గల్గని యింద్రుండు, కఱకేది వంగని కనకనగము,
తనువెత్తి క్రాలెడు ధర్మదేవత, రూపుఁ దాల్చిన రాజవిద్యావిభూతి,
గీ.
నయవిదుండు రాజనారాయణుఁడు విశ్వ
నాథుఁ - డనుచు వర్ణనములుసేయ
వరుస నిట్లు కృతుల వళిసీస మన నొప్పు
వసుధ వైభవాలవాల మగుచు.

అక్కిలి వడిసీసము
గీ.
సీసఖండంబు వళ్లిట్లు చెప్పి గీతి
ఖండవళి రెంటి కొక్కఁడుగా నొనర్ప
నదియ యక్కిలివడిసీసమండ్రు కృతుల
లక్ష్యములు చూచి యెఱుఁగుఁ డీలాగు లెల్ల.
క.
సీసములకు గీతులకుం
బ్రాసములును వళ్ళుఁ గలయఁబడి కవితల ను
ద్భాసిల్లఁ దఱచు నియమ
వ్యాసక్తియుఁ గలుగుఁ జెప్పవలసినచోటన్.

169.సుందరి (భ, భ, ర, స, వ) 9(శక్వరీచ్ఛందం) పాదమునకు 14 అక్షరములు.ప్రాస నియమం కలదు.
భా స వంబుల నొప్పుఁ ద్మజవిశ్రమం
బారఁగ సుందరవృత్తమై బుధవర్ణ్యమై.

సుందరీ వృత్తం (భ, గ, గ) (సుప్రతిష్ఠాచ్ఛందము) పాదమునకు 5 అక్షరములు.ప్రాస నియమం కలదు.
సుంరి యొప్పుం - జెంది భగా నిం - పొం నియుక్తిన్ - గందుకలీలన్.

170.సుకేసరము (న, జ, భ, జ, ర)10
(అతిశక్వరీచ్ఛందం) పాదమునకు15అక్షరములు.ప్రాస నియమం కలదు
భజరేఫలం గది వచ్చి దిగ్యతిన్ సునమతి న్సు కేసరము శోభితంబగున్.
171.సుగంధి (ర, జ, ర, జ, ర) 9 ప్రాస లేదు
దంబుజం బురంబు జంబు రంబు చెన్నుమీరగా
దొమ్మిదింట విశ్రమంబు తోరమై సుగంధికిన్.

172.సుముఖి
173.స్రగ్ధర ( మ, ర, భ, న, య, య, య,)8,15(ప్రకృతిచ్ఛందం) పాదమునకు21 అక్షరములు.ప్రాస నియమము కలదు.
సారెస్ నాగాధి రాట్పందశ విరమతన్ స్రగ్ధరా వృత్తమౌ గాం
తా రాజీవాస్త్ర యుద్యన్మరభనయయయోద్భాసి యై రంగభూపా.

174.స్రగ్విణి (ర, ర, ర, ర) 7
(జగతీచ్ఛందం) పాదమునకు 12 అక్షరములుండును.ప్రాస నియమం కలదు.
స్ఫారితంబై యకూపా ర ర శ్రేణితో
సా మై స్రగ్విణీచారువృత్తం బగున్.

175.హంసరుతము
176.హంసి
177.హరనర్తనము
178.హరిగతి
179.హరిణగతి

180.హరిణి (న, స, మ, ర, స, ల, గ)11
(అత్యష్టిచ్ఛందం)పాదమునకు 17 అక్షరములు.ప్రాస నియమం కలదు.
రిణి యనువృత్తంబయ్యెన్ శంరాత్తయతిప్రథన్
రి న స మ రే ఫావక్రాంతోపేత స్థలంగంబులన్.
181.హయప్రచారము

182.హలముఖి(ర, న, స) (బృహతీచ్ఛందము) పాదమునకు 9 అక్షరములు. ప్రాస నియమం కలదు.
కామితక్రియ హలముఖీ - నా మొప్పు రనసలచేన్.

183.క్షమ
184.క్ష్మాహారము


వీటి గణాలు, యతిప్రాసలు వగైరా తెలుసుకోవాల్సిఉంది.


15 comments

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks