నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Showing posts with label నా అనువాదాలు. Show all posts
Showing posts with label నా అనువాదాలు. Show all posts

Oct 1, 2008

చితి చింతా ద్వ యోర్మధ్యే

చితి చింతా ద్వ యోర్మధ్యే
చింతా నామ గరీయసీ
చితా దహతి నిర్జీవం
చింతా ప్రాణయుతం వపుఃI

నా అనువాదం:
"చితి", "చింత"ల రెంటి నడుమ
"చితి" కంటెను" చింత" యధిక చింతాకరమౌ
"చితి" కాల్చును నిర్జీవిని
"చితి"లేకే కాల్చు"చింత" జీవముతోనేI

2 comments

Jun 7, 2008

శిశుర్వేత్తి పశుర్వేత్తి

శిశుర్వేత్తి పశుర్వేత్తి
వేత్తి గానరసం ఫణిః
కో వేత్తి కవితా తత్త్వం
శివో జానాతి వా నవా
పై శ్లోకానికి నా అనువాదం.
శిశువులు పశువులు పాములు
వశులగుదురు గానమునకు వసుధను నిజమే
వశమా కవితా తత్త్వము
శశిధరునకు నైన తెలియ శక్తులె యితరుల్

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks