నాహం కర్తాః హరిః కర్తా తత్పూజా కర్మ చాఖిలం తదాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నా అన్యథా

Showing posts with label నా పరిచయం. Show all posts
Showing posts with label నా పరిచయం. Show all posts

May 18, 2013

మరచిపోలేని మంచిరోజు

మరచిపోలేని  మంచిరోజు
ఈ రోజు మే నెల 17వ తారీఖు. నేనూ నా భార్యా అమెరికా వచ్చి అప్పుడే 11 రోజులయింది. మా అబ్బాయి చి.కృష్ణకిషోర్ ఈ రోజున అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా నుండి తన Executive M.B.A. Degree ని అందుకొనే Commencement రోజు( మన దేశంలో Convocation అని అంటారు దీన్ని). ఇందుకోసమనే మేమిద్దఱం ఇండియా నుండి బయలుదేరి అమెరికాలో వాడు నివసిస్తున్న Los Angels కు దగ్గఱగానున్న కరోనా కు ఈనెల 6వ తారీఖున వచ్చాము.

మా అబ్బాయి అమెరికా వచ్చి దాదాపు 14 సంవత్సరాల పైగా కాలం గడచినప్పటికీ మేం వాడిని చూడటానికి అమెరికా రావటం పడలేదు. చివరికి ఈ Commencement కి రావటానికై అప్లై చేస్తే వీసా వచ్చింది. అంతకు పూర్వం ఓసారి వీసా కోసం ప్రయత్నిస్తే అది సఫలం కాలేదు.


మా అబ్బాయి ఇండియాలో చదువుకున్నది B.B.M. వాడిని నేను వాడు చదువుకునే రోజుల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితులవల్ల ఇంజనీరింగ్ చదివించలేక పోయాను. వాడు Peoples Soft పూర్తిచేసి అమెరికాకు ఉద్యోగం నిమిత్తం 1998లో వచ్చాడు. ఇంజనీరింగ్ చదవలేకపోయాననే బాధ వాడిని అధికంగా పీడిస్తూ ఉండేది. తరవాత్తఱవాత వాడు కొంచెం అమెరికాలో సెటిల్ అయ్యాక తన జాబ్ తాను చేసుకుంటూనే Executive M.B.A. Course ను తన స్వంత సంపాదనతో పూర్తి చేసాడు. ఇది మాకు చాలా ఆనందం కలిగించిన విషయం. పిల్లలు ప్రయోజకులైతే పెద్దవాళ్ళకి సహజంగా కలిగే ఆనందాన్ని ఈరోజు మేమిద్దఱం అనుభవించాం. కానీ ఓప్రక్క వాడిని చదువుకునే రోజుల్లో వాడి కోరిక మేరకు చదివించలేకపోయామనే బాధ  మమ్మల్ని పీడిస్తూనే ఉన్నది. ఈరోజు మేం అనుభవిస్తున్న ఈ సంతోషాన్ని నా బ్లాగు మిత్రులందరితో పంచుకోవాలనిపించి ఈ పోస్టును వ్రాయటం జరిగింది.

3 comments

Sep 19, 2010

నా కోరిక

భాద్రపద శుద్ధ త్రయోదశి - సర్వధారి నామ సంవత్సరం - ఇది నా పుట్టిన తేదీ -


ఈ రోజు భాద్రపద శుద్ధ త్రయోదశి - వికృతి నామ సంవత్సరం - ఇది నా 63 వ పుట్టిన తేదీ -
(నేను పుట్టినపుడు మా పెద్దలు వ్రాయించిన జాతకం కాగితంలోని వివరాల ప్రకారం.)
ఆ కాగితం వ్రాసిన ఆయన ఆంగ్ల తేదీని అందులో వ్రాయలేదు.
అందుకని ఎప్పుడూ ఆ తిథినాడే నా పుట్టిన రోజు జరుపుకుంటే బావుంటుంది కదాని నా కనిపించింది.
అవును, మనం మన అన్ని పండుగలనూ పబ్బాలనూ తెలుగు తిథుల ప్రకారమే జరుపు కుంటున్నాం కదా. మరి అటువంటప్పుడు మన పుట్టినరోజులను కూడా అదేవిధంగా తిథుల ప్రకారం ఎందుకు జరుపుకోకూడదు ?
ఒకప్పుడు మన కలన యంత్రాలలో ఆంగ్లభాషను మాత్రమే వాడేవాళ్ళం. కాని ఇప్పుడు మన తెలుగు భాషను కూడా ధారాళంగా వాడగలుగుతున్నాం కదా !
మన వాళ్ళలో చాలామంది కంప్యూటరు రంగంలో నిష్ణాతులైన వారెందరెందరో వున్నారు ! అటువంటప్పుడు మన కలన యంత్రాల్ని వారు తెలుగు సంవత్సరముల (ప్రభవ, విభవ మొ..60), తెలుగు నెలల(చైత్రము,వైశాఖము...12) , మరియు తెలుగు తేదీల (పాడ్యమి,విదియ ...మొ 15+15)వాలుపట్టీలు (dropdown boxes) కలదానినిగా ఎందుకు మార్చలేరు ?

అలా మార్చితే ఇంచక్కా అధికమాసాలొచ్చినప్పుడు శ్రీ వేంకటేశ్వరస్వామి వారు తన బ్రహ్మోత్సవాలను సంవత్సరానికి రెండు సార్లు జరుపుకుంటున్నట్లుగా మనం కూడా మన పుట్టిన రోజులను సంవత్సరానికి రెండు సార్లు జరుపుకుని ఆనందించవచ్చుగా.

అంతేకాదు

మనం మన పిల్లలను మన సంస్కృతీ సాంప్రదాయాలను మరచిపోకుండా ఉండే వారిగా కూడా
తీర్టి దిద్దుకోవచ్చు కదా ! అందర్నీ ఆలోచించమని ప్రార్థన .! క్రమ క్రమంగా మనం ఇప్పటినుండీ
ఇటువంటి కార్యక్రమాల్ని చేపడితే మన ముందు తరాల వారికి ఉపయోగం గా ఉంటుందని
నా అభిప్రాయం. ఇదే అభిప్రాయంతో ఉండేవారు ఇంకా చాలామంది ఉండవచ్చుననే ఆశతో నేను
నా పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టును  ప్రచురిస్తున్నాను. నా పుట్టిన రోజు సందర్భంగా
(ఆంగ్ల తేదీ ప్రకారం) శుభాకాంక్షలు తెలిపిన వారి కందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

6 comments

May 20, 2010

నా బ్లాగు రెండవ వార్షికోత్సవం.

నా బ్లాగు ప్రయాణంలో--------
ఇదే రోజు . రెండు సంవత్సరాల క్రితం మొట్టమొదటి బ్లాగును ప్రారంభించాను. అదే "నరసింహ" పేరుతో.
నేను బ్లాగు మొదలుపెట్టడానికి కారణమైన బ్లాగు మాత్రం తెలుగు పద్యం బ్లాగు . ఆయనకు నేను ఏకలవ్య శిష్యుడిని.
క.
బ్లాగెడిది భాగవతమట
బ్లాగించెడి వాఁడురామభద్రుండట నే
బ్లాగిన భవహర మగునట
బ్లాగెద వేరొండు గాథ బ్లాగగ నేలా .

అసలు ఈ 'బ్లాగు' అనే ఆంగ్ల పదానికి సరియైన తెలుగు అర్థం ఎవరైనా పెద్దలు తెలియజేస్తే కృతజ్ఞుడినై వుంటాను.
భక్త కవి పోతన గారికి క్షమాపణలతో---

4 comments

Mar 15, 2010

నూతన సంవత్సర శుభాకాంక్షలు


బ్లాగ్మిత్రులందరికీ మరియు వారి కుటుంబ సభ్యులకూ వికృతి నామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు.     మల్లిన నరసింహారావు

3 comments

Jan 13, 2010

సంక్రాంతి శుభాకాంక్షలు

బ్లాగ్మిత్రులందరికీ సంక్రాంతి పండుగ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

2 comments

Sep 2, 2009

ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే

భాద్రపద శుద్ధ త్రయోదశి -బుధవారం, ధనిష్టా నక్షత్రం-1948 సంవత్సరం-ఆరోజు నేను పుట్టానట--నాజాతకం వ్రాసిన పెద్దమనిషి అంటే పురోహితులవారు ఎందుచేతనో మరి ఆరోజు నాటి ఆంగ్ల తేదీని జాతకం కాగితంలో వ్రాయలేదు--అందుచేత ఆ తిథినాడే నాపుట్టిన రోజు అనుకుంటే బాగుంటుంది కదా
ఈ రోజూ అదే తిధి, అదే వారం కాని నక్షత్రం రేపొస్తుందనుకుంటా --2009 సంవత్సరం--
అంటే సరిగ్గా 61 సంవత్సరాలు పూర్తయ్యాయన్నమాట. దీన్నే తిరగేస్తే 16 సంవత్సరాలన్నమాట. అందుకే

ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అనుకుంటే పోలా ఎంత హుషారుగుంటది.

7 comments

Aug 22, 2009

పండుగ శుభకామనలు

బ్లాగ్మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.

2 comments

May 20, 2009

మొదటి సంవత్సరం పూర్తి

ఈ బ్లాగు తన మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్నది.
దీనిలో ఎక్కువగా అన్నమయ్య సంకీర్తనలు, శ్రీమదాంధ్రభాగవతం లోని దశమ స్కంధం- కొన్ని ఘట్టాలు, కరుణశ్రీ గారి పద్యాలు కొన్ని, ముత్యాల సరాలు, నేను కొత్తగా బ్లాగ్ ముఖంగా నేర్చుకుని ఎన్నికల సందర్భంగా వ్రాసిన పద్యాలు కొన్ని, ఇతర తాళ్ళపాక కవుల సంకీర్తనలు , ఉత్పలమాలికలు ఒకటి రెండు ఇలా ఇలా పాఠకులకు నచ్చుతాయనుకున్నవి నాకు నచ్చినవి నేను మెచ్చినవి కలగలిపి పోస్టుచెయ్యటం జరిగింది. దాదాపు ౨౫౦ పోస్టులవరకూ పూర్తయినవి.
ఈ బ్లాగు మాత్రమే కాకుండా ఇంకో ౫ బ్లాగులు కూడా ఈ సంవత్సరంలో మొదలు పెట్టాను. వాటిలో కూడా ఒకోదానిలో సుమారు ౯౦ నుండి ౧౦౦ వరకూ పోస్టులు పోస్టు చెయ్యటం జరిగింది. ఈ మధ్యనే ప్రారంభించిన శ్రీమదాంధ్రమహాభారతం కూడా ౮౦ నుంచి ౯౦ పోస్టుల మధ్య నడుస్తూ బ్లాగరులను సంతోషపెడుతున్నట్లుగా తెలుస్తోంది. నా బ్లాగులను వ్రాతలను చదువుతూ అప్పుడప్పుడూ తమ తమ అభిప్రాయాలను తెలియపరుస్తూ నాకు ఉత్సాహాన్ని కలిగిస్తున్న బ్లాగ్మిత్రులందరికీ నా శత సహస్ర ధన్యవాదాలు ఈ బ్లాగ్ముఖంగా తెలియజేసుకుంటున్నాను.
ప్రేమతో ---- మీ మల్లిన నరసింహారావు

7 comments

Apr 3, 2009

శ్రీరామ నవమి

బ్లాగ్మిత్రులందరికీ నా శ్రీరామ నవమి శుభాకాంక్షలు

నరసింహారావు మల్లిన

0 comments

Mar 7, 2009

మహిళామణులందరికీ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు

మహిళామణులందరికీ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు.

క.
మహిళలు మీకందఱకును
మహిత శుభములౌనుగాక మంచిగ నేడున్
వహవా మార్చెనిమిదిననె
మహిళల దినమంట మీకు మంగళ మగుగాన్.

అందరు మహిళా బ్లాగర్లకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

0 comments

Jan 22, 2009

బ్లాగెడిది భాగవతమట

క.
బ్లాగెడిది భాగవతమట
బ్లాగించెడి వాఁడు రామభద్రుండట నే
బ్లాగిన భవహర మగునట
బ్లాగెద వేరొండు గాథ బ్లాగగ నేలా .

అసలు ఈ 'బ్లాగు' అనే ఆంగ్ల పదానికి సరియైన తెలుగు అర్థం ఎవరైనా పెద్దలు తెలియజేస్తే కృతజ్ఞుడినై వుంటాను.
భక్త కవి పోతన గారికి క్షమాపణలతో---

0 comments

Oct 27, 2008

దీపావళి శుభాకాంక్షలు

బ్లాగ్మిత్రులందరికి "దీపావళి శుభాకాంక్షలు".

0 comments

Sep 13, 2008

భాద్రపద శుద్ధ త్రయోదశి - ధనిష్టా నక్షత్రం.

భాద్రపద శుద్ధ త్రయోదశి - ధనిష్టా నక్షత్రం.-1948 సంవత్సరం.
ఈ రోజూ అదే తిధి, అదే నక్షత్రం.2008 సంవత్సరం.
మొదట వ్రాసినది - నా పుట్టిన రోజు. సరిగ్గా 60 సంవత్సరాలు పూర్తయ్యాయన్నమాట.-అదీ సంగతి.

15 comments

Jul 3, 2008

నే నెందుకు బ్లాగాలనుకుంటున్నాను

నే నెందుకు బ్లాగాలనుకుంటున్నాను।ఎప్పుడో అప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాలి ప్రతి బ్లాగరూ।నేనెందుకు బ్లాగుతున్నానంటే--
ప్రతి వ్యక్తికీ తనకు తోచినవీ, తను తెలుసుకున్నవీ నలుగురితో పంచుకోవాలనీ - నలుగురూ తనను ఆహా ఓహో అని మెచ్చుకోవాలనీ ఓ విధమైన కోర్కె - బయటకు చెప్పకపోయినా - లోలోపల వుంటూవుంటుంది। దీనికి నేనూ మినహాయింపు కాదు।నలుగురిలో ఫ్రీగా మాటలద్వారా అన్నీ చెప్పాలంటే అది అందరికీ సాధ్యమయ్యేపని కాదు।బ్లాగు ద్వారా ఇటువంటివి చాలా సులభం।పైగా బ్లాగుల ద్వారా ఒకే సమయంలో ఎక్కడెక్కడో వున్నవారితో భావాలు పంచుకోవటం తేలిగ్గానూ వీలుగానూ వుంటుంది।ఈ టపా రాస్తున్న సమయంలోనే రానారె గారి క్షణికమ్ టపా చూడటం జరిగింది।నేను ఈ టపాలో చెప్పాలని అనుకుంటున్న భావాలను నాకంటే ఎంతో అందంగా వారు అందులో ఆవిష్కరించారు।సంయమనంతో కూడిన భావవ్యక్తీకరణ ద్వారా బ్లాగ్మిత్రులందరూ ఒకరికొకరు సహాయపడగలరని, అలా సహాయపడతారనీ ఆశిస్తూ నా మూడు బ్లాగుల ద్వారా(నరసింహ,భారతీయం,అన్నమయ్య పలుకుబడులు-జాతీయములు) సుమారుగా ५० బ్లాగులు పూర్తి చేయగలిగాననే సంతోషాన్ని నలుగురితో పంచుకుందామని-----

3 comments

May 20, 2008

బ్లాగ్లోకం లోనికి ప్రవేశం చేస్తున్నాను.మీ అందరి సహకారం అర్ధిస్తూ--నరసింహారావు మల్లిన-పెద్దాపురం-తూ .గో . జిల్లా,ఆంధ్ర ప్రదేశ్

2 comments

ధర్మో రక్షతి రక్షితః

ధర్మాన్ని రక్షించండి. అది మిమ్మల్ని రక్షిస్తుంది.

విషయసూచిక

నాకిష్టమైనవి

ప్రస్తుత వీక్షకులు

నా ప్రపంచం

అతిథి దేవో భవః

స్వపరిచయం

 
నరసింహ - Template By Blogger Clicks